శుక్రవారం, 12 జులై 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (11:03 IST)

సాగర్‌రాణాపై సుశీల్‌ బృందం.. స్టిక్‌తో దాడి చేస్తూ కనిపించిన రెజ్లర్

ఛత్రసాల్‌ స్టేడియంలో సాగర్‌రాణాపై సుశీల్‌ బృందం దాడి చేసిన సంగతి తెలిసిందే. తనంటే అందరికీ భయం ఉండాలని, తన ఆధిపత్యాన్ని అంగీకరించాలన్న ఉద్దేశంతో తన మిత్రుడి చేత సుశీల్‌ ఈ వీడియో తీయించాడు. దానిని రెజ్లింగ్‌ వర్గాలకు పంపించాలనుకున్నాడు. 
 
కానీ దాడిలో తీవ్రంగా గాయపడిన రాణా రెండు రోజుల తర్వాత చనిపోవడంతో అతడు పారిపోయాడు. ఆ తర్వాత పోలీసుల గాలింపు చర్యలు చేపట్టి.. సుశీల్‌ను అరెస్ట్ చేశారు. అతనిని పట్టుకుంటే లక్ష రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. సుశీల్‌కు ముందస్తు బెయిల్‌‌ను తిరస్కరించారు. 
 
ప్రస్తుతం కోర్టు రిమాండ్‌లో వున్న సుశీల్ దర్యాప్తునకు సహకరించట్లేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో యువ రెజ్లర్‌ సాగర్‌ రాణాపై సుశీల్‌ కుమార్‌ దాడి చేస్తున్న వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి ఈ పుటేజీ హిందీ, ఇంగ్లిష్‌ మీడియాలో ప్రసారం అవుతోంది. 
 
ఛత్రసాల్‌ స్టేడియంలో రాత్రివేళ పది మందికి పైగా కలిసి రాణాపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అందులో సుశీల్‌ బేస్‌బాల్‌ స్టిక్‌/కర్రను చేతిలో పట్టుకున్నాడు. ఆగ్రహంతో ఊగిపోతూ కనిపించాడు. ఈ వీడియో క్లిప్‌ బయటకు రావడంతో అతడికి మరింత నష్టం కలగనుంది.