సోమవారం, 11 ఆగస్టు 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (14:45 IST)

పేస్‌పై గృహహింస ఆరోపణలు నిజమే.. తేల్చేసిన ముంబై కోర్టు

Leander paes
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌పై నమోదైన గృహ హింస ఆరోపణలు నిజమని తేలింది. పేస్ మాజీ భాగస్వామి, ప్రముఖ మోడల్-నటి రియా పిళ్లై దాఖలు చేసిన గృహ హింస కేసును విచారించిన ముంబైలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆరోపణలు నిజమని తేల్చింది.
 
గత ఎనిమిదేళ్ల పాటు పేస్, తాను సహజీవనం చేస్తున్నామని, అయితే ఇటీవల తనపై గృహ హింసకు పాల్పడుతున్నట్టు ఆరోపిస్తూ 2014లో రియా పిళ్లై కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఆమె ఆరోపణలు నిజమని తేల్చి తీర్పు వెలువరించింది.
 
దీంతో నిర్వహణ ఖర్చుల కింద ఆమెకు నెలకు లక్ష రూపాయలు చెల్లించాలని, అలాగే, ఇంటి అద్దె కింద మరో రూ. 50 వేలు చెల్లించాలని ఆదేశించింది. 
 
అయితే, ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటే అద్దె మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని, ఆమె బయటకు వెళ్లిపోవాలని కోరుకుంటే కనుక ఆ మొత్తం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.