'బంగారు చేప' రికార్డు బద్ధలైంది...

Kristof Milak
Last Updated: గురువారం, 25 జులై 2019 (10:14 IST)
ఈత కొలనులో బంగారు చేపగా రికార్డు సృష్టించిన మైఖేల్ ఫెల్ఫ్స్ నెలకొల్పిన రికార్డు నెలకొల్పింది. ఒలింపిక్ పోటీల్లో ఏకంగా 23 బంగారు పతకాలను కైవసం చేసుకున్న ఫెల్ప్స్... ఈత కొలనులో బంగారు చేపగా గుర్తింపు పొందాడు. ఈ రికార్డును 19 యేళ్ల కుర్రాడు బద్ధలు కొట్టాడు.

మైఖేల్ ఫెల్ప్స్ 2009లో బటర్‌ఫ్లై విభాగంలో 200 మీటర్ల దూరాన్ని 1:51.51 సెకన్లలో చేరుకుని రికార్డు సృష్టించాడు. ఇప్పుడా రికార్డును 19 ఏళ్ల హంగేరియన్ క్రిస్టోఫ్ మిలక్ బద్దలుగొట్టాడు.

దక్షిణ కొరియాలోని గ్వాంగ్జు నగరంలో జరిగిన ఫినా వరల్డ్ చాంపియన్ షిప్ పోటీల్లో క్రిస్టోఫ్ ఈ ఘనత సాధించాడు. పురుషుల బటర్‌ఫ్లై విభాగంలో 200 మీటర్ల దూరాన్ని కేవలం 1:50.73 సెకన్లలోనే చేరుకున్నాడు. దిగ్గజ స్విమ్మర్ ఫెల్ప్స్ రికార్డును బద్దలుగొట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా క్రిస్టోఫ్ పేర్కొన్నాడు.దీనిపై మరింత చదవండి :