ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. శ్రీరామనవమి
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (20:47 IST)

శ్రీరామ నవమి.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ఏం చేయాలి?

Lord Rama
శ్రీరామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీరామ శోభాయాత్రలు నిర్వహిస్తారు. శ్రీరామనవమి నాడు ఎరుపు దుస్తులు ధరించడం శుభప్రదం. ఒక గిన్నెలో నీరు తీసుకుని 108 సార్లు శ్రీరామరక్ష మంత్రాన్ని జపించాలి. ఈ పవిత్ర జలాన్ని ఇంటి నలుమూలల్లో చల్లాలి. ఇలా చేయడం వల్ల ధన లాభం కలుగుతుంది. ఆర్థిక నష్టాలు తొలగిపోతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. 
 
అలాగే బెల్లం పానకాన్ని శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించిన తరువాత కుటుంబ సభ్యులు స్వీకరించాలి. తులసి దళంతో రాములవారిని, మారేడుతో సీతమ్మను, తమలపాకులతో హనుమంతున్ని పూజించాలి.
 
కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొనాలంటే శ్రీరామనవమి రోజున రామాలయంలో నెయ్యి దీపం లేదా నూనె దీపం వెలిగించాలి. జై శ్రీరామ్ అనే పదాన్ని 108 సార్లు జపించాలి. దీంతో ఇంట సుఖసంతోషాలు చేకూరుతాయి. శ్రీరామ నవమి రోజు సాయంత్రం సీతారాములకు పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించాలి. "ఓం జై సీతారామ్" అని మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే వివాహ బంధంలో అడ్డంకులు తొలగిపోతాయి.