మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (12:13 IST)

గుమ్మడి బ్రెడ్ ఎలా చేయాలో తెలుసా?

కావలసిన పదార్థాలు:
గుమ్మడికాయ గుజ్జు - 2 కప్పులు
చక్కెర - 3 కప్పులు
కోడిగుడ్లు - 4
మైదాపిండి - 3 కప్పులు
బేకింగ్ పౌడర్ - 2 స్పూన్స్
లవంగం పొడి - పావుస్పూన్
దాల్చిన చెక్క పొడి - అరస్పూన్
వాల్‌నట్ ముక్కలు - 1 కప్పు
ఉప్పు - కొద్దిగా
బేకిండ్ సోడా - 1 స్పూన్
కిస్మిస్ - 1 కప్పు
నీళ్లు - 1 కప్పు
 
తయారీ విధానం:
ముందుగా కోడిగుడ్ల సొనను బాగా గిలగొట్టి అందులో చక్కెర, మైదాపిండి, నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై బేకిండ్ సోడా, దాల్చిన చెక్క పొడి, లవంగాల పొడి, బేకింగ్ పౌడర్, వాల్‌‍నట్ ముక్కలు, కిస్మిస్ వేసి కలపాలి. బాగా లోతుగా ఉండే గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి ఒవెన్‌లో బేక్ చేయాలి. ఇది చల్లారిన తరువాత బ్రెడ్ ముక్కల్లా కోసుకోవాలి. అంతే... గుమ్మడి బ్రెడ్ రెడీ.