కేసీఆర్ కార్ స్టీరింగ్ ఓవైసీ చేతిలో వుంది: అమిత్ షా
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్రహోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మాట తప్పారని, ఇచ్చిన ఒక్క మాట, హామీని కేసీఆర్ నెరవేర్చలేదని అమితి షా ఫైర్ అయ్యారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి కేసీఆర్ మాట తప్పారన్నారు.
బీజేపీ బీసీ ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో బీడీ వర్కర్స్ కోసం ప్రత్యేక హాస్పిటల్, ఉత్తర తెలంగాణ నుంచి వెళ్లిన గల్ఫ్ బాధితుల కోసం ఎన్ఆర్ఐ పాలసీ ఇచ్చామన్నారు.
ఇంకా శుక్రవారం ఆర్మూర్ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. టర్మరిక్ బోర్డు ఇచ్చింది బీజేపీ అని చెప్పుకొచ్చారు. అవినీతి కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన అవసరం ఉందన్నారు.
కేసీఆర్ కార్ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీతో సుపరిపాలన సాధ్యం కాదని అన్నారు. పనిలో పనిగా కాంగ్రెస్‌పై అమిత్ షా మండిపడ్డారు.