మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 7 నవంబరు 2024 (23:35 IST)

విద్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం జాతీయ అభివృద్ధికి కీలకం

Neeraj sharma
ఆక్సిలో ఫిన్‌సర్వ్ నిర్వహించిన 'ఎడ్యువిజన్ 2024' అనే కార్యక్రమంలో ప్రముఖ పరిశ్రమ దిగ్గజాలు, పాఠశాలల యాజమాన్యాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా విద్య నాణ్యతను మెరుగుపరచడం, విద్యా మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడం గురించి ఇక్కడ చర్చించారు. 
 
ఎడ్యువిజన్ కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్కే మహమూద్ 'ముఖ్య అతిథి'గా హాజరయ్యారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర గౌరవనీయులైన పరిశ్రమ ప్రముఖులలో సౌమ్య వేలాయుధం, డైరెక్టర్, ఎడ్యుకేషన్ & స్కిల్లింగ్ కెపిఎంజి  ఇన్ ఇండియా, సాక్షి సోధి, సీనియర్ టెక్నికల్ అసిస్టెన్స్ అడ్వైజర్, ఆపర్చునిటీ ఇంటర్నేషనల్, ఇండియా, రేష్మా బేగం, ప్రిన్సిపాల్, వాక్సాన్ ఇంటర్నేషనల్ స్కూల్, డాక్టర్ సస్మిత పురుషోత్తం, చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి ), బౌగెన్‌విల్లే డా స్కూల్, ఎస్  శివ రామ కృష్ణ ఆచార్య, చైర్మన్ ,  ఎస్ ఆర్ కె గ్రూప్ ఆఫ్ స్కూల్స్, అశోక లతా బీరా, ఫౌండర్ మరియు సీఈఓ , నోబుల్ పామ్స్ స్కిల్స్ మరియు నీరజ్ శర్మ, సీబీఓ , ఆక్సిలో ఫిన్సర్వ్ ఉన్నారు. 
 
“ప్రపంచ జ్ఞాన నాయకుడిగా ఎదగడానికి భారతదేశం యొక్క ప్రయాణం, మన విద్యా మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడం మరియు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రారంభమవుతుంది. వ్యూహాత్మక ఆర్థిక సహాయం ద్వారా, ఆక్సిలో విద్యా పరివర్తనకు ఉత్ప్రేరకం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది” అని నీరజ్ శర్మ తెలియజేశారు. సౌమ్య వేలాయుధం మాట్లాడుతూ ఏ దేశానికి అయినా సుస్థిర అభివృద్ధికి విద్య పునాదిగా నిలుస్తుంది. పాఠశాలలు మరియు ఉన్నత విద్యా సంస్థలు ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను నిర్మించుకోవాలన్నారు. 
 
సాక్షి సోధి మాట్లాడుతూ, “సాంకేతికతను స్వీకరించడం తక్షణ అవసరం. పరిశ్రమలలో వేగవంతమైన మార్పులకు అనుగుణంగా నైపుణ్యం మెరుగు పరుచుకోవటం అవసరం" అని అన్నారు. ఆక్సిలో ఫిన్‌సర్వ్ రాబోయే 5 సంవత్సరాలలో 10000 పాఠశాలలు మరియు విద్యా సంస్థలకు నిధులు సమకూర్చాలని యోచిస్తోంది.