బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 జులై 2021 (12:26 IST)

తెలంగాణాలో మరో నాలుగు డిగ్రీ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు డిగ్రీ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నాలుగు కాలేజీలను వికారాబాద్, పరిగి, ఉప్పల్, మహేశ్వరం ప్రాంతాలల్లో ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.
 
అయితే మంజూరు చేసిన అన్ని కాలేజీలు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బాగా పట్టున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉండటం గమనార్హం. ఈ క్రమంలో ముఖ్యమంత్రికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రభుత్వ డిగ్రీ కాలేజీల మంజూరుపై ఆయా ప్రాంతాల స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.