శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 1 జనవరి 2020 (15:49 IST)

రెండ్రోజుల్లో 430 కోట్లు తాగేశారు

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో మందు కిక్ ఎక్కువైంది. ఇయర్ ఎండ్ రోజు వైన్స్ దగ్గర రష్ ఎక్కువగా ఉంటుందని చాలామంది ఒకరోజు ముందుగానే తీసిపెట్టు కున్నారు. దీంతో డిసెంబర్‌‌ 30వ తేదీ రాష్ట్రంలో రూ.250 కోట్ల అమ్మకాలు జరిగాయి.

31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకే రూ.150 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మరో రూ.30 కోట్ల అమ్మకాలు జరుగుతాయని అధికారులు అంచనా వేశారు. గతేడాది డిసెంబర్ 31వ తేదీ రూ.100 కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయని, ఈసారి దీనికి 50 శాతం కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయని చెప్పారు.

ఈ ఏడాది డిసెంబర్ ఫస్ట్​ నుంచి 19తేదీ వరకు రూ.1036 కోట్లు సేల్ చేయగా, నెల మొత్తం రూ. 2250 కోట్ల అమ్మకాలు జరిగాయన్నారు.