శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (18:11 IST)

యువశక్తి దేశానికి ఎంతో అవసరం: బండారు దత్తాత్రేయ

దేశ భవిష్యత్తుకు యువశక్తి ప్రధానమని... యువత సన్మార్గంలో నడిచేందుకు కృషిచేయాలని హిమచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో ఆయనకు పౌర సన్మానం చేశారు.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హిమచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు పౌర సన్మానం నిర్వహించారు. జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని ఘనంగా సన్మానించారు.

ఆయన చేసిన సేవలను కొనియాడారు. మతం, కులం వేరైనా మనమందరం భారతీయులమని వెల్లడించారు. భారతదేశంలో రాజ్యాంగం గొప్పదని... రాజ్యాంగం ఉన్నంతవరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని గవర్నర్ అభిప్రాయపడ్డారు.

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రగతికి విద్య, ఉపాధి, వైద్యం ముఖ్యమని తెలిపారు.