బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (22:31 IST)

తెలంగాణలో మరో కొత్త పార్టీ

కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ తనయుడు డాక్టర్ పుంజాల వినయ్ నేతృత్వంలో తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు రాబోతోంది. హైదరాబాద్ బంజారా ఫంక్షన్ హాల్‌లో మద్దతుదారులతో వినయ్ భేటీ అయ్యారు. సాధించుకున్న తెలంగాణలో అందరికీ న్యాయం జరగాలనే డిమాండ్‌తో కొత్తపార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వినయ్ ప్రకటించారు.

డిసెంబర్‌లో కొత్త పార్టీ పేరును వినయ్‌కుమార్ ప్రకటించనున్నారు. తన స్నేహితుడు డాక్టర్ మిత్ర ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. రాజకీయవేత్తలకు గుర్తు చూసి ఓటేసే వాళ్లు కావాలన్నారు. ఓటింగ్‌లో గుర్తులను కూడా ఓటర్లు గుర్తుపట్టలేని స్థితికి ప్రజలను తీసుకొచ్చారని ఆయన విమర్శించారు.

చదువుకున్నప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థిని చూసి ప్రజలు ఓటేస్తారని, అందుకే ప్రభుత్వాలు విద్యకు ఖర్చుపెట్టడం లేదని, విద్యావ్యవస్థను నీరు గారుస్తున్నారని వినయ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.