శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (12:13 IST)

మందుబాబులకు గుడ్ న్యూస్ఃబార్ షాప్స్ పని వేళల పొడిగింపు

Bars
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బార్ షాప్స్ పని వేళలను పొడిగిస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. అర్థరాత్రి 12 గంటల వరకు బార్స్ నిర్వహించుకునేలా అనుమతులిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, వీకెండ్స్‌లో ఏకంగా ఒంటి గంట వరకు బార్లు తెరుచుకునేందుకు అనుమతులిచ్చింది. 
 
ఇక స్టార్ హోటళ్లు, ఎయిర్‌పోర్ట్ హోటళ్లు లైసెన్స్ ఫీజుపై 25 శాతం అదనపు రుసుం చెల్లించి 24 గంటల పాటు మద్యం అమ్మకాలు జరుపుకునేందుకు అనుమతినిచ్చింది.
 
తెలంగాణలో ప్రభుత్వ ఖజానాకు మద్యం ద్వారా భారీ ఆదాయం సమకూరుతోన్న సంగతి తెలిసిందే. ప్రతీ నెలా ఎంత లేదన్న రాష్ట్రంలో రూ.2500 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.