గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మే 2023 (17:19 IST)

ఎమ్మెల్యే రాజసింగ్‌కు అవమానం.. పిలిచి గేటు వద్దే ఆపేశారు..

rajasingh
గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్‌కు అవమానం జరిగింది. తెలంగాణ కొత్త సచివాలయం గేటు వద్ద ఆయనను ఆపారు. ఆపై లోనికి పంపలేదు. దీంతో తనను పిలిచి అవమానించారుని రాజాసింగ్ కోపంతో ఊగిపోయారు. మంత్రి తలసాని తనను పిలిచి మరీ అవమానించారని రాజాసింగ్ వాపోయారు. 
 
సిటీ ఎమ్మెల్యేలతో మీటింగ్ వుందని తలసాని పిలిస్తే సచివాలయానికి వచ్చానని అయితే తనను గేట్ వద్దనే ఆపేశారని చెప్పుకొచ్చారు. 
 
ఎమ్మెల్యేలకే సచివాలయంలోకి అనుమతి లేకుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని రాజాసింగ్ ప్రశ్నించారు. ప్రజల డబ్బుతో కట్టిన సచివాలయంలోకి ప్రజా ప్రతినిధులను అనుమతించకపోవడం సిగ్గు చేటని రాజాసింగ్ పేర్కొన్నారు.