గురువారం, 8 జూన్ 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated: శనివారం, 27 మే 2023 (12:18 IST)

జూన్ 22 నుంచి బోనాలు.. రూ.15 కోట్లు కేటాయింపు

Bonalu
తెలంగాణలో జూన్ 22 నుంచి బోనాలు ప్రారంభం కానున్నాయి. గోల్కొండలోని శ్రీజగదాంబిక, సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి, పాతబస్తీలోని శ్రీ అక్కన్నమాదన్న ఆలయాలతోపాటు 26 దేవాలయాలలో బోనాల పండుగ జరుగుతుంది. 
 
ఈ ఆలయాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అంబారీ ఊరేగింపు కోసం ఏనుగును ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని మంత్రి తలసాని తెలిపారు. బోనాల ఏర్పాట్ల కోసం జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ..  బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. 
 
22న గోల్కొండలో బోనాలు ప్రారంభమవుతాయని, జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 16న పాతబస్తీ బోనాలు జరుగుతాయని తలసాని వెల్లడించారు.