గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (22:02 IST)

గద్వాల నుంచి పీఎం కేర్స్ ఫండ్‌కు భారీ విరాళాలు

పీఎం కేర్స్ ఫండ్‌కు తెలంగాణలోని ప్రతి బీజేపీ కార్యకర్త సహాయం అందించాలన్న మాజీ మంత్రి డీకే అరుణ పిలుపు మేరకు పీఎంకేర్స్ ఫండ్‌కు భారీగా విరాళాలను గద్వాల నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందించారు. ఈ సందర్బంగా బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ 3 లక్షల విరాళం అందించారు. 
 
ఇందులో భాగంగా గద్వాల నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలసి ఈ ఒక రోజే దాదాపుగా 10 లక్షల రూపాయల మేరకు నిధులను పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్బంగా విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి మాజీ మంత్రి డీకే అరుణ ధన్యవాదాలు తెలిపారు. 
 
ఇప్పటివరకు విరాళం అందించని వారు కూడా తమకు తోచినంత అందించి మన దేశానికి, మన ప్రధానమంత్రి మోడీ గారికి అండగా నిలవాలని కోరారు.