శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (08:09 IST)

పోర్న్ సైట్ లో ఫేస్ బుక్ ఫోటోలు.. గూగుల్ కి తెలంగాణ హైకోర్టు నోటీసులు

రోజు రోజుకి పెరిగిపోతున్న వెబ్ సైట్స్ పై గూగుల్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా ఈ వెబ్‌సైట్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.

ఫేస్‌బుక్‌లో ఉన్న పేర్లు, ఫోటోలను తీసుకొని అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తున్నారంటూ ఓ యువతి హైకోర్టును ఆశ్రయించింది. గూగుల్ సంస్థకు దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం  గూగుల్ తీరును తప్ప పట్టింది.. వెబ్ సైట్స్ పై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది.