శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 మే 2022 (20:38 IST)

భూపాలపల్లి కేటీపీపీలో మరో ప్రమాదం: ముప్పు తప్పింది..

power plant fire
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెండో దశ 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మంటలు చెలరేగాయి. చెల్పూర్‌లోని కేటీపీపీలో యాష్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో యాష్ హ్యాండ్లింగ్ సిస్టమ్ పంప్ మోటర్‌లో మంటలు చెలరేగాయి.
 
బాటమ్ యాష్ ఓవర్ ఫ్లో పంప్ మోటార్ కాలిపోయింది. కార్మికులు లేకపోవడంతో ముప్పు తప్పింది. వరుసగా చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలతో కలకలం రేగుతోంది. 10 రోజుల వ్యవధిలో కేటీపీపీలో ఇది రెండో ప్రమాదం. వరుస ప్రమాదాలతో కేటీపీపీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు.