ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 22 జులై 2020 (17:15 IST)

మత్తు ఇచ్చి తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం... ఎక్కడ?

మాయమాటలు చెప్పి తల్లీకూతుళ్లకు మత్తు మందిచ్చారు. ఆనక వరుస బెట్టి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు స్నేహితులు. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌ సందయ్య నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకుండే మహిళ, ఆమె కుమార్తెపై ఇంటి యజమాని, ఆయన ఇద్దరు స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ ఘటనపై బాధితురాలు చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఓ వివాహిత(35) తన కూతురు(15), కుమారుడితో కలిసి ఓ ఇంట్లో నివాసముంటోంది.

ఇంటి యజమాని తమకు ఇచ్చిన ఆహార పదార్థాల్లో మత్తుమందు కలిపి ఇచ్చాడని, అవి తిని మత్తులోకి జారుకున్నాక తనతో పాటు తన కూతురిపైనా ముగ్గురూ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలితో పాటు కూతురిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.