శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 మార్చి 2020 (08:07 IST)

మరోమారు వరుడి తండ్రితో వధువు తల్లి పరార్‌

అవును.. వాళ్లిద్దరూ లేచిపోయారు. తమ పిల్లల పెళ్ళిళ్ళ కోసం మాటల్లోకి దిగిన ఆ జంట.. విరహం తాపలేక లేచిపోయారు. వియ్యమందుకోవాల్సిన ఆ జంట.. పడక పంచుకున్నారు. ఇలా జరిగింది ఒక్కసారి కాదు.. ఇది రెండో సారి.
 
గుజరాత్‌లో జనవరి నెలలో తమ పిల్లల పెళ్లి సంబరాలకు ముందు ‘లేచిపోయిన’ ఓ వధువు తల్లి, వరుడి తండ్రి మళ్లీ అదే పనిచేశారు. సూరత్‌కు చెందిన హిమ్మత్‌ పాండవ్‌(46), నవ్‌సారీకి చెందిన శోభనా రావల్‌ పరస్పరం ఆకర్షితులై లేచిపోవడంతో పిల్లల పెళ్లి నిలిచిపోయింది.

అయితే కుటుంబ, సమాజ ఒత్తిళ్లకు తలొగ్గి నెల రోజుల క్రితం తిరిగి వచ్చినా ఒకర్నొకరు విడిచి ఉండలేకపోయారు. మూడ్రోజుల క్రితం ఇద్దరూ మళ్లీ లేచిపోయారు. సూరత్‌లోనే ఓ ఇంట్లో సహజీవనం మొదలెట్టేశారు.

తొలిసారి వెళ్లిపోయినప్పుడు వారిరువురిపై మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు ఈసారి మాత్రం ఏ కేసూ నమోదు చేయలేదు.

తిరిగివచ్చిన తరువాత శోభనను ఆమె భర్త ఇంట్లో అడుగుపెట్టనివ్వకపోవడంతో ఆమె తన తలిదండ్రుల ఇంట్లో ఉండిపోయింది.

లేచిపోయిన ఇద్దరూ చిన్ననాటి నుంచీ మంచి స్నేహితులు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా పెద్దలు వద్దనడంతో ఏం చేయలేకపోయారు.