1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (15:59 IST)

బాలికను గర్భవతిని చేసిన యువకుడు...

హైదరాబాద్‌కు చెందిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసి గర్భవతిని చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరానికి చెందిన గోరు అలియాస్‌ షేక్‌ హుస

హైదరాబాద్‌కు చెందిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసి గర్భవతిని చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరానికి చెందిన గోరు అలియాస్‌ షేక్‌ హుసేన్‌(22) వంట పనిచేస్తుంటాడు. 
 
నగరానికి చెందిన బాలిక(15)తో పరిచయం పెంచుకుని శారీరకంగా లోబర్చుకున్నాడు. ప్రస్తుతం ఆ బాలిక 8 నెలల గర్భవతి. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు వివాహం చేసుకోవాలని కోరితే దానికి ఆ యువకుడు నిరాకరించాడు. దీంతో బాలిక కుటుంబసభ్యులు కామాటిపురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యువకుడిపై నిర్భయ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.