గురువారం, 20 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (10:29 IST)

తెలంగాణలో దంచికొట్టిన వర్షం.. రికార్డులు బ్రేక్ చేసిన వర్షపాతం

rain
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు వర్షపాతం నమోదైంది. జూన్, జులై నెలల్లో భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా చివరి 30 రోజుల్లో చూస్తే రికార్డులు బ్రేక్‌ అయ్యాయి. 
 
జూన్‌ ఒకటి నుంచి ఇప్పటివరకు స్టేట్‌వైడ్‌గా 66.4 సెంటీమీటర్ల రెయిన్‌ఫాల్‌ రికార్డైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 107శాతం అధికమని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 
 
జులై 21 నుంచి 27వరకు హైదరాబాద్‌లో 137శాతం అదనపు వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. అధికంగా మేడ్చల్‌ జిల్లాలో 253శాతం, రంగారెడ్డి జిల్లాలో 191శాతం అదనపు వర్షం కురవడంతో కొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి.  
 
దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే 100శాతం అధికంగా వర్షం దంచికొట్టింది. ఒక్క వారం రోజుల్లోనే సరికొత్త రికార్డు నమోదైంది.