గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు
గ్రేటర్ హైదరాబాద్‌లో వ్యాప్తంగా భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు.
ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ప్రాంతంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్, మాన్సూన్ బృందాలు రంగం లోకి దిగాయి. అక్కడక్కడ మోకాలి లోతు నీరు నిలవడంతో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ సిబ్బంది మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు.