శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

టకీలా పబ్‌లో అశ్లీల క్యాబరే నృత్యాలు - 18 మంది అరెస్టు

takila pub
సికింద్రాబాద్ నగరంలో మరో క్లబ్‌ను క్యాబరే అశ్లీల నృత్యాలు కనిపించాయి. సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్‌లో ఉన్న టకీలా పబ్‌లో అశ్లీల క్యాబరే డ్యాన్సులు హంగామా జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి తనిఖీ చేయగా, అనేక మంది యువతీయువకులు మద్యం మత్తులో తూగుతూ హుషారెత్తించే పాటలకు అశ్లీలంగా క్యాబరే డ్యాన్సులు చేస్తూ కనిపించారు.
 
ముఖ్యంగా అమ్మాయిలతో క్యాబరే డ్యాన్సులు చేయించారు. పైగా, నిర్ణీత సమయం దాటిపోయినప్పటికీ ఈ కబ్ కార్యకలాపాలు కొనసాగించారు. దీంతో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు పబ్‌పై శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత దాడులు చేశారు. అపుడు నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ను నిర్వహిస్తున్నారని తేల్చిన పోలీసులు పబ్‌ను సీజ్ చేశారు. పబ్‌లో క్యాబరే డ్యాన్స్‌లు చేస్తున్న 18 మందిని అరెస్టు చేశారు.