బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2019 (16:54 IST)

మొసలి వంతెనకు వేలాడుతూ కనిపిస్తే..!

నీళ్లలో ఉండాల్సిన మొసలి దారి తప్పి జనాల్లోకి వచ్చింది. అదికూడా ఓ వంతెనకు వేలాడుతూ కనిపించింది. అది చూసిన జనం బెంబేలెత్తిపోయారు. మరి నేరుగా చూస్తే ఇంకేమైనా ఉందా..!

అమ్మో ఊహించుకుంటేనే భయం వేస్తోంది. ఓ ముసలి బ్రిడ్జికి వేలాడుతూ.. జనాలను ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం ధూదిగాం గ్రామంలో జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగాని జాతీయ రహదారి 44 పై ప్రత్యక్షమైంది మొసలి.

ఎటు వెళ్లాలో తెలియక రోడ్డు మద్యలో చిక్కుకుపోయింది. బ్రిడ్జికి వేలాడుతున్న మొసలిని స్థానికులు రక్షించారు. జేసీబీ సహాయంతో మొసలిని రక్షించిన స్థానికులు.. ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు.