1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : ఆదివారం, 17 అక్టోబరు 2021 (15:51 IST)

తెలంగాణలో ఒక్క రోజు రూ. 150 కోట్లకు మద్యం తాగేశారు

తెలంగాణ ప్రజలకు దసరా వచ్చిందంటే చాలు పట్నం, పల్లె అన్న తేడా లేకుండా కుటుంబమంతా ఏకమై సందడిగా గడుపుతుంటారు.

ఇక ఏముంది అందరూ ఒక్కదగ్గరుంటే మందు, ముక్క లేకుండా ఎలా.. అందుకే రాష్ట్రమంతా ఏకమై రికార్డు స్థాయిలో తాగేశారు. ఏకంగా కేవలం ఒక్క రోజులో దాదాపు రూ. 150 కోట్లకు పైగా మద్యం తాగేశారు.

అయితే కరోనా కారణంగా చల్లటి పదార్థాలు తీసుకోవద్దని డాక్టర్లు చెప్పడంతో బీర్లు తాగని మందుబాబులు, ఇప్పుడు ఆ భయం లేకపోవడంతో కొన్ని నెలల తర్వాత చల్లగా తాగేశారు. యూత్ అంతా పట్టుబట్టి బీర్ల అమ్మకాలను 53 శాతం పెంచినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.