తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీలోకి వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆ పార్టీలో చేరే ఇతర పార్టీలకు చెందిన నేతల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే వారంలో తెరాస సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాషాయం కండువా కప్పుకోనున్నారు. ఇంతలోనే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ...