బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 మే 2022 (19:11 IST)

రైతులందరికీ 100 గజాల చొప్పున ప్లాట్లు.. కేటీఆర్

ktramarao
తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. వరంగల్ పర్యటనలో గీసుకొండ మండల హవేలీలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కిటెక్స్ టెక్స్‌టైల్ పరిశ్రమకు కేటీఆర్ భూమి పూజ చేసిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కష్టాన్ని, నష్టాన్ని తట్టుకుని భూములిచ్చిన వారికి పేరుపేరునా పాదాభివందనలు చేస్తున్నానన్నారు. 
 
భూములు ఇచ్చిన రైతులందరికీ 100 గజాల చొప్పున ప్లాట్లు ఇవ్వాలంటూ అధికారులకు కేటీఆర్ సూచించారు. భూములిచ్చిన రైతులందరికీ కచ్చితంగా ప్లాట్లు ఇస్తామని మాటిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతులకు లాభం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.