శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2019 (18:57 IST)

కేంద్ర రక్షణ మంత్రితో కేటీఆర్ భేటీ..ఎందుకో?

దిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కేటీఆర్ భేటీ అయ్యారు. అనంతరం అన్ని రాష్ట్రాల ఐటీ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు.

దిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రక్షణ శాఖ భూముల అప్పగింతపై వినతిపత్రం అందజేశారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం కొన్నాళ్లుగా.. కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తోంది.

త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని రక్షణమంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం. రాజ్నాథ్తో భేటీ అనంతరం.. కేటీఆర్.. అన్ని రాష్ట్రాల ఐటీ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. పరిపాలనలో ఐటీ సాంకేతికత వినియోగం, కొత్త సంస్థలకు ప్రోత్సాహం, ఈ రంగంలో సవాళ్లపై ప్రధానంగా చర్చించనున్నారు.