శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (21:09 IST)

ఇది ట్రైలర్​ మాత్రమే.. సినిమా ముందుంది: కేటీఆర్​

గత ప్రభుత్వాలు యాభై ఐదేళ్లలో కూడా చేయలేని అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిందని మంత్రి కేటీఆర్​ శాసనసభలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని మంత్రి తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదన్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​. ముఖ్యమంత్రి కేసీఆర్​ అకుంఠిత దీక్షతో కాళేశ్వరంను పూర్తిచేశారని అసెంబ్లీలో చెప్పారు. గత ప్రభుత్వాలు యాభై ఐదేళ్లలో కూడా చేయలేని అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిందన్నారు.

ఇది ట్రైలర్​ మాత్రమేనని... సినిమా ఇంకా ముందుందన్నారు కేటీఆర్. మూసీ సుందరీకరణ హామీకి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వేగవంతంగా అభివృద్ధి పనులు చేయడమే కాకుండా మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.
 
తెలంగాణ భవన్​లో జాతీయజెండాను ఆవిష్కరించిన కేటీఆర్​
తెలంగాణ భవన్​లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

తెలంగాణ భవన్‌లో సెప్టెంబర్‌ 17 వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి, ఆచార్య జయశంకర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు.

కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌, మాజీ హోంమంత్రి నాయిని, మేయర్ బొంతు రామ్మోహన్​తో పాటు తెరాస నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.