శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం

మంత్రి కేటీఆర్‌ సంతకం ఫోర్జరీ కలకలం

నల్గొండ జిల్లాలో మంత్రి కేటీఆర్‌ సంతకం ఫోర్జరీ చేయడం కలకలం రేపుతోంది. ఏకంగా మంత్రి కేటీఆర్‌ సంతకాన్నే ఫోర్జరీ చేసి విధుల్లో చేరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మిర్యాలగూడ మండలం రావులపెంట జడ్పీ బాలికల హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తున్న మంగళ.. ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌గా కూడా వ్యవహరిస్తోంది. ఇటీవల ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ బాధ్యతల నుంచి మంగళను విద్యాశాఖ అధికారులు తప్పించారు. మరో ఉపాధ్యాయుడికి ఇంఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు.

దీంతో రికమెండేషన్‌ లెటర్‌పై కేటీఆర్‌ సంతకం ఫోర్జరీ చేసి విధుల్లో చేరింది ఉపాధ్యాయురాలు మంగళ. ఆమెపై ఆరోపణలు రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మంత్రి సంతకం ఫోర్జరీపై దర్యాప్తు చేపట్టారు.