శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 20 నవంబరు 2020 (12:03 IST)

బతకాలని లేదంటూ 6వ అంతస్తు నుంచి దూకేసిన లేడీ టెలికాలర్

పని ఒత్తిడో లేదంటే ఇంట్లో సమస్యలో కాదంటే ప్రేమ వ్యవహారమో కానీ 20 ఏళ్ల యువతి ఆరో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. టెక్ మహీంద్రాలో టెలికాలర్‌గా పనిచేస్తున్న ఈ యువతి గురువారం నాడు ఈ దారుణానికి పాల్పడింది.
 
వివరాల్లోకి వెళితే.. నామాలగుండు ఉప్పర్ బస్తీలో వుండే రంగన్, షీలా దంపతులు పెద్ద కుమార్తె సుస్మిత. ఈమె గత కొన్ని నెలలుగా రెజిమెంటల్ బజార్ సెబాస్టియన్ రోడ్డులోని టెక్ మహీంద్రాలో టెలీకాలర్‌గా పనిచేస్తోంది.
 
ఐతే గురువారం కార్యాలయానికి వచ్చిన వెంటనే గది కిటికీ తలుపు తీసుకుని కిందకి దూకేసింది. తనకు బతకాలని లేదంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది.