శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 జనవరి 2021 (12:38 IST)

మద్యం మత్తులో భార్యను కడతేర్చాడు.. ఆపై చీరతో ఉరి వేశాడు

మద్యం మత్తులో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. అనంతరం దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పైడిమడుగు గ్రామానికి చెందిన గంగజను ఇబ్రహీంపట్నం మండలం తిమ్మపూర్ గ్రామానికి చెందిన గోపాల్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. 
 
గోపాల్, గంగజ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య గ్రామమైన పైడిమడుగులోనే గోపాల్ నివాసం ఉంటున్నాడు. అయితే కొంతకాలంగా భార్య భర్తల మధ్య విబేధాలు చోటుచేసుకుంటున్నాయి. ఏ పనిచేయకుండా ఇంటి వద్దనే ఉంటున్న మద్యానికి బానిసగా మారాడు. 
 
ఈ విషయంలోనే పలుమార్లు భార్యతో వాదనకు దిగాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి భార్య గంగజతో గోపాల్ ఘర్షణ దిగాడు. మద్యం మత్తులో విచక్షణ మరిచి ప్రవర్తించాడు. కట్టుకున్న భార్య గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం గంగజుల ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు.
 
మృతిచెందిన ఆమెను చీరతో ఉరి వేసి.. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. తమ కూతురుని ఆమె భర్తే హత్య చేశాడని గంగజ కుటుంబ సభ్యులు తెలిపారు. రోజు తాగి వచ్చి గంగజతో గొడవపడేవాడని చెప్పారు. గోపాల్‌కు బయటినుంచి తాము కూడా అప్పులు అడిగిచ్చామని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.