సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (19:14 IST)

ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం - మూడు వారాల విశ్రాంతి

kavitha
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి చెందిన ఎమ్మెల్సీ కె.కవిత కాలికి గాయమైంది. దీంతో ఆమె మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. వైద్యుల సలహా మేరకు మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇదే విషయ ఆమె ఓ ట్వీట్ చేశారు. 
 
"నా కాలికి గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు" అని పేర్కొన్నారు. ఏదైనా సహకారం లేదా సమాచారం కోసం నా కార్యాలయం అందుబాటులో ఉంటుంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత కాలిక గాయమైందన్న వార్త తెలుసుకున్న ఆమె అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.