గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (17:40 IST)

తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పది : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత

kavitha in temple
తమిళనాడు రాష్ట్ర అస్తిత్వం చాలా గొప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.కవిత అన్నారు. పైగా, ఇక్కడి ప్రజలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారని చెప్పారు. చెన్నైలో ఓ ఆంగ్లపత్రిక నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు చెన్నైకు వచ్చిన ఆమె.. శుక్రవారం నగర శివారు ప్రాంతమైన గెరుగంబాక్కంలో హీరో అర్జున్ నిర్మించిన అతిపెద్ద హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలోని అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు అర్జున్‌కు అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు. చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందన్నారు. తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని, ఇక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారన్నారు. 
 
తమిళనాడు ప్రజలు తమ సంస్కృతి, భాష, చరిత్ర, వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని, ప్రతి ఒక్కరికి ఆ గౌరవభావం ఉండాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆలోచన తత్వం భారతీయులను ఐక్యంగా ఉంచుతుండడం గర్వంగా ఉందని తెలిపారు.