సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 31 జులై 2019 (08:07 IST)

మై హోమ్ మాయా లీలలు

“మై హోమ్ మాయా ప్రపంచం” ఈ కంపెనీల లిస్ట్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించటం ఖాయం. మైహోమ్‌ రామేశ్వర రావు 520 బినామీ కంపెనీలు పెట్టి 9,500 ఎకరాలు పైగా భూములను సంపాదించారు. 520 కంపెనీలలో బినామీ డైరెక్టర్లు ఉన్నారు. రామేశ్వరరావు వియ్యంకుడు యశోదా హాస్పిటల్ పేరున 7 వేల ఎకరాలు, 437 బినామీ కంపెనీల పేరుతో ఆక్రమించుకున్నారని తెలుస్తోంది.

మొత్తం హైదరాబాద్‍ ఈ కుటుంబాల చెరలోకి వెళ్ళిపోయింది. చిన్నజియార్‌ స్వామి ఈ కుటుంబాలకు పావలా వడ్డీకి భారీగా నగదు ఇస్తుంటాడని తెలుస్తోంది. ఆ డబ్బును పెట్టుబడిగా చేసుకొని వందలకొద్ది బినామీ కంపెనీలను పెట్టి, వాటి కోసం తమ అంగ, అర్థ బలాలను ఉపయోగించి తెలంగాణను నిలువునా దోచేస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి పలు దస్తావేజులు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.