శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (09:40 IST)

ఎక్సైజ్ సీఐతో ప్రైవేటు స్కూల్‌ నిర్వహకురాలి ఎఫైర్.. ఇద్దరు కలిసి పారిపోతుండగా ఏం జరిగిందంటే?!

నిజామాబాద్ డివిజన్‌ లోని ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ శాఖ సీఐ గా పని చేస్తున్న అధికారి ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వాహకురాలితో కొనసాగిస్తున్న వివాహేతర సంబంధం గురువారం సాయంత్రం బహిర్గతమైంది.

నిజామాబాద్ ఎక్సైజ్ సీఐ నగరంలోని ఆర్యనగర్ ప్రాంతంలో గల ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వాహకురాలితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలో ఎక్సైజ్ సీఐ సదరు స్కూల్ నిర్వాహకురాలితో కలిసి గురువారం సాయంత్రం ఫోర్త్ టౌన్ ఏరియా నుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం తెలియడంతో సదరు మహిళ భర్త అక్కడికి వచ్చి వారిని పట్టుకున్నారు. వెంటనే ఎక్సైజ్ సీఐ ని ఆయన చితకబాదారు.

అలాగే తన భార్య కూడా తప్పు చేసిందని తెలుసుకున్న అతను ఆమెను కూడా పట్టుకొని చితగ్గొట్టాడు. వివాహేతర సంబంధం విషయం సంబంధిత ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్న మహిళ భర్త ఉపక్రమించారు.

దీంతో విషయం తెలుసుకున్న సదరు ఎక్సైజ్ సీఐ భార్య ప్రైవేట్ స్కూల్ మహిళ భర్త కు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే తన భర్త పరువు పోతుందని, మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తాను కట్టడి చేస్తానని ఆమె విజ్ఞప్తి చేసింది.

దీంతో ఎక్సైజ్ సీఐ మళ్లీ తన భార్యతో ఎలాంటి సంబంధం కొనసాగించకుండ ఉండాలని స్కూల్ నిర్వాహకురాలు భర్త లిఖితపూర్వకంగా తీసుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని ఫోర్త్ టౌన్ ఎస్ఐ సందీప్ కు తెలియజేశారు.