సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఆగస్టు 2022 (10:56 IST)

రియల్టర్ కాల్పుల కేసు.. నిందితుల అరెస్ట్

murder
రియల్టర్ కాల్పుల కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. మాదాపూర్‌లో కలకలం రేపిన ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. ముజాయిద్‌, మహ్మద్‌ జిలానీ, మహ్మద్‌ ఫిరోజ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు…రెండు కంట్రీమేడ్‌ పిస్టళ్లు, ఏడు రౌండ్ల బుల్లెట్లు, ఒక కత్తితో పాటు కారు, బైక్‌ను సీజ్‌ చేశారు.
 
పాతబస్తీ కాలాపత్తర్‌లోని నవాబ్‌కుంటకు చెందిన రౌడీషీటర్‌ ఇస్మాయిల్‌, అతని స్నేహితుడు జహంగీర్‌పై కాల్పులు జరిపింది ముజాయిద్‌, జిలానీ, ఫిరోజ్‌ గ్యాంగ్‌. నీరూస్‌ జంక్షన్‌ ..హండ్రెడ్‌ ఫీట్ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల కేసును మాదాపూర్‌ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. 
 
నిందితుల కోసం 5 పోలీస్‌ టీమ్‌లు విస్తృతంగా గాలించాయి. జహీరాబాద్‌లో ముగ్గురినీ అరెస్ట్‌ చేశారు. ఇస్మాయిల్‌ హత్యకు జహీరాబాద్‌లోని భూ వివాదమే కారణమని దర్యాప్తులో తేలింది.