శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 జులై 2022 (13:38 IST)

తండ్రిని దారుణంగా కొట్టి చంపేసిన కుమారుడు..

crime scene
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసిన తండ్రిని ఓ తనయుడు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రిని కర్రతో, బెల్టుతో విచక్షణ రహితంగా కొడుకు కొట్టడంతో ఆ తండ్రి ప్రాణాలు కోల్పోయారు.
 
వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్‌లో 63 సంవత్సరాల సత్యనారాయణ అనే వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పక్షవాతం బారిన పడి మంచానికి పరిమితం అయ్యాడు. 
 
అయితే తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో, తండ్రితో కొడుకు సురేష్ గొడవకు దిగాడు. ఫుల్లుగా మద్యం తాగి వచ్చిన సురేష్ ఈ క్రమంలో కోపంతో ఊగిపోయి తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన తండ్రి సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు.
 
ఇక ఈ విషయం స్థానికులకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కొడుకును అరెస్ట్ చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.