శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (17:14 IST)

మైనర్ బాలికపై రేప్... స్పందించిన సోనూ సూద్.. కురచ దుస్తులు, పబ్‌లు?

Sonu Sood
సినీ నటుడు సోనూసూద్ రియల్ లైఫ్‌లో కూడా హీరో అనిపించుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా ఎందరికో సాయం చేశారు. తాజాగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్ రేప్ కేసుపై సోనూసూద్ స్పందించారు. 
 
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందనే విషయాన్ని వార్తల్లో చూసి షాక్ అయ్యానని తెలిపారు.  ఇది చాలా పెద్ద నేరమని అన్నారు. అత్యాచారానికి పాల్పడింది మేజర్లా లేక మైనర్లా అనేది ముఖ్యం కాదని... వారు ఎలాంటి నేరం చేశారనేదే ముఖ్యమన్నారు. 
 
ఇలాంటి నేరాలకు పబ్‌లు, మహిళలు వేసుకునే కురుచ దుస్తులు కారణమవుతున్నాయని అనడం సరైంది కాదని సోను అన్నారు. మనం ఆలోచించే విధానంలోనే మార్పు వుందని సోనూ వ్యాఖ్యానించారు. 
 
గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయనే విషయాన్ని సోనూ సూద్ గుర్తు చేశారు.