శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (22:27 IST)

ఆధ్యాత్మికత ట్రెండ్ సృష్టికర్త కేసీఆర్: చిన్నజీయర్ స్వామి

ఆధ్యాత్మికత ట్రెండ్ సృష్టికర్త ముఖ్యమంత్రి కేసీఆర్ అని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. భక్తిని కుడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన పాలకుడు ఆయన అని ఆయన కొనియాడారు.యాదాద్రి దేవాలయ పునరుద్ధరణనే అందుకు నిదర్శనమన్నారు. అదే స్ఫూర్తిని మంత్రి జగదీష్ రెడ్డి కొనసాగిసస్తున్నారని ఆయన చెప్పారు.

సూర్యపేట పట్టణంలో నీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం జీర్ణోద్ధరణ పనులకు ఆయన మంత్రి జగదీష్ రెడ్డి తో కలసి  సోమవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన సభలో జీయర్ స్వామి మాట్లాడుతూ అభివృద్ధి లో ఆధ్యాత్మికత ఒక భాగమేనని,అటువంటి ఆధ్యాత్మికత ను భాగస్వామ్యం చేసినందునే తెలంగాణా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు.

సమజాభివృద్ధిలో భగవత్ భక్తి అవశ్యం ఎంతైనా ఉందన్నారు.అటువంటి భక్తి ఉన్న సమాజం అభివృద్ధి లో అగ్రభాగాన ఉంటుందన్నారు.శ్రీశ్రీశ్రీ రామంజుల స్వామి వారి కృప తో వెయ్యి సంవత్సరాల క్రితం అటువంటి భక్తికి బీజం పడిందన్నారు.ఆ బీజం వతవృక్షాలుగా మారి విస్తరించడంతో 700 ఏండ్లు సవ్యంగా సాగిందని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ తరువాత కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపద్యంలో పాశ్చాత్యుల పాలన రావడంతో గడిచిన 300 ఏండ్లుగా వ్యవస్థ చిన్నా భిన్నంగా మారిందన్నారు.రామంజుల వారి స్ఫూర్తి ఇప్పటికీ ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్, బీహార్,ఉత్తరప్రదేశ్, తదితర రాష్ట్రాలలో ఇప్పటికి కన్పిస్తుందని ఆయన చెప్పారు.అదే శోభ ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో కనిపిస్తుందన్నారు.

అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన చొరవనే కారణమన్నారు.అధికారికంగా ముందెన్నడూ ఏ ముఖ్యమంత్రి చెయ్యని సాహసన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని ఆయన ప్రశంసించారు.రాష్ట్ర అభివృద్ధి లో దైవాన్ని ఒక బాగంగా మలిచిన ఘనత కుడా ఆయనదే నన్నారు.అదే స్ఫూర్తిని ముందుకు తీసుకు పోతున్న నేత మంత్రి జగదీష్ రెడ్డి అని ఆయన మీద ప్రశంసలు కురిపించారు.

అటువంటి నేత ఇక్కడ పాలకుడు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం మని ఆయన అభివర్ణించారు. ఆయన రాకతో ఈ ప్రాంతం రూపురేఖలు మారాయని ఆయన కొనియాడారు.అటువంటి వ్యక్తి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం జీర్ణోద్ధరణ కు పూనుకోవడం అభినందనియమమన్నారు.అటువంటి భారాన్ని మీద వేసుకుని ముందుకు సాగుతున్న మంత్రి జగదీష్ రెడ్డికి భక్తులు తోడ్పాటు నందించాలని ఆయన పిలుపునిచ్చారు.

పట్టణంలో ఆధ్యాత్మిక శోభను విరాజిమ్మే ఈ ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు వేగవంతం కావాలని ఆయన మంగళాశాసనలు అందించారు.ఇదే స్ఫూర్తి జిల్లా మొత్తం విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. శాఖాపరమైన భాగస్వామ్యం తగ్గించి ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు.ఆలయ జీర్ణోద్ధరణ శంకుస్థాపన తో వికాస తరంగణి కార్యకర్తలకు బాధ్యత పెరిగిందన్నారు.

అదే విదంగా వ్యక్తుల మధ్య తరతమ భేదాలను రూపుమాపే శక్తి ఒక్క ఆధ్యాత్మికతకే ఉందన్నారు. అందుకు సూర్యాపేట జిల్లా కేంద్రమే చక్కటి నిదర్శనమన్నారు. ప్రత్యర్థులు గా ఉన్న దివంగత మీలా సత్యనారాయణ, మోరిశెట్టి సత్యనారాయణ లు ఇదే దేవాలయం సాక్షిగా కార్యక్రమాలలో పోటీ పడి పాల్గొనడాన్ని ఆయన గుర్తుచేశారు.యజ్ఞ యాగదులతో పర్యావరణ పరిరక్షణ సులభ తరమౌతుందాన్నారు.

ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా వంటి సమస్యలు కుడి హోమం తో మాయం అవుతాయన్నారు.శాస్త్రీయంగా ఇది రుజువు మయిందన్నారు.భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ఆ ప్రాంతంలో అందరూ చనిపోతే ఒక ఇంట్లో నలుగురు ప్రాణాపాయం లేకుండా బయట పడ్డారని అందుకు కారణం ఆ ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యితో రెండుపూటలా హోమం చేయడమే నన్నారు.

ఇది నేను చెప్పింది కాదు అని ఆ దుర్ఘటన జరిగినప్పుడు హిందు పేపర్ లో వచ్చిందని జీయర్ స్వామి ఉటంకించారు.లోక హితం కోసం 1035 కుండలులో పెద్ద ఎత్తున యజ్ఞాన్ని చెప్పట్ట బోతున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకు అవసరమైన నెయ్యి ని రాజస్థాన్ ,గుజరాత్ లనుండి ప్రత్యేకంగా తెప్పిస్తున్నట్లు ఆయన చెప్పారు.

సభ నిర్వాహకులు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సూర్యపేట జిల్లా కేంద్రంగా మారడం తో పాటు పట్టణం విస్తరించి ఉండడంతో దేవాలయాన్ని విస్తరించాలని మూడు సంవత్సరాల క్రితమే నిర్ణయించామన్నారు. అశేష సంఖ్యలో భక్తుల భక్తిని పొందుతున్న ఆలయంలో పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకుని విస్తరణ,అభివృద్ధి పనులకు ప్రణాలికలు రూపొందించమని ఆయన వెల్లడించారు.

ఆలయంలోకి వచ్చే భక్తుల కు మరింత ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించాలి అన్నదే సంకల్పం అన్నారు.అటువంటి జీర్ణోద్ధరణ పనుల శంకుస్థాపన కు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి హాజరు కావడం హర్షనియమని ఆయన కొనియాడారు. యింకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.