తెలంగాణాలో ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏప్రిల్ మూడో తేదీ నుంచి ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు.
వంద శాతం సిలబస్‌తో నిర్వహించే ప్రతి పరీక్షకు మూడు గంటల సమయం కేటాయిస్తారు. ప్రతి పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే, సామాన్య పరీక్ష మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 3న ప్రారంభమయ్యే ఈ పరీక్షలన్నీ ఏప్రిల్ 11వ తేదీతో ముగుస్తాయి. ఏప్రిల్ 12, 13 తేదీల్లో మాత్రం ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారు.
టెన్స్ ఎగ్జామ్ టైమ్ టేబుల్...
03-04-2023 ఫస్ట్ లాంగ్వేజ్
04-04-2023 సెకడ్ లాంగ్వేజ్
06-04-2023 థర్డ్ లాంగ్వేజ్
08-04-2023 గణిత శాస్త్రం
10-04-2023 సైన్స్
11-04-2023 సోషల్ స్టడీస్
12-04-2023 వొకేషనల్ పేపర్ -1
13-04-2023 వొకేషనల్ పేపర్ -2