బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (16:21 IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : బర్రెలక్క మేనిఫెస్టో ఎలా ఉందో చూశారా?

barrelakka
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇలాంటి వారిలో బర్రెలక్క అలియాస్ శిరీష్ ఒకరు. ఆమె కొల్లాపూర్ అసెంబ్లీ స్థా నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ తన కాళ్లపై తాను నిలబడేందుకు వీలుగా బర్రెలు మేపుకుంటూ తన తల్లిని పోషించుకుంటున్నారు. పైగా ఈ ఎన్నికల్లో ఆమె నిరుద్యోగుల కోసం పోటీ చేయాలని నిర్ణయించిన రంగంలోకి దిగారు. దీంతో ఆమెకు అనేక మంది నిరుద్యోగులు సంపూర్ణ మద్దతు తెలుపుతూ సొంతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. 
 
తనను గెలిపించి అసెంబ్లీకి పంపితే నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని, ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తానని మేనిఫెస్టోలో ప్రకటించారు. పేదల ఇళ్ళ నిర్మాణానికి కృషి చేయడంతో పాటు నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇప్పిస్తానని, ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఉచిత వైద్యం, విద్య, నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు, ఉచిత శిక్షణ, ఉన్నత చదువుల కోసం కోచింగ్ ఉచితంగా ఇప్పించేందుకు ప్రయత్నిస్తాని శిరీష తన మేనిఫెస్టోలో పాల్గొన్నారు.