మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (09:05 IST)

ఏ, బీ, సీ, డీ గ్రేడ్లలో ఇంటర్ ద్వితీయ ఫలితాలు వెల్లడి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితాఇంద్రా రెడ్డి తన కార్యాలయంలో ఫలితాలను వెల్లడించారు. కరోనా నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయగా పరీక్ష ఫీజు చెల్లించిన 4,73,850 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 
 
వీరిలో అందులో 1,76,726 మంది ఏ గ్రేడ్‌ సాధించారు. 1.04 లక్షల మంది బీ గ్రేడ్‌ సొంతం చేసుకొన్నారు. మొత్తం విద్యార్థుల్లో 2,37,441 మంది బాలికలుండగా, 2,36,409 మంది బాలురు ఉన్నారు. విద్యార్థులు పొందిన మార్కులను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 
 
ఈ ఫలితాల కోసం విద్యార్థులు ఫస్టియర్‌ హాల్‌టికెట్‌ నంబర్‌, ప్రైవేట్‌ విద్యార్థులు తమ పూర్వపు హాల్‌ టికెట్‌ నంబర్ల ఆధారంగా tsbie.cgg.gov.in, examresults.ts.nic.in, results.cgg.gov.in వెబ్‌సైట్లలో చెక్‌ చేసుకోవచ్చు. ఆ మార్కులతో సంతృప్తి చెందకపోతే కరోనా పరిస్థితులు సద్దుమణిగాక పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. 
 
మరోవైపు గ్రేడ్ల వారీగా ఉత్తీర్ణులైన విద్యార్థులను పరిశీలిస్తే, ఏ గ్రేడ్‌ (75 శాతం ఆపై మార్కులు పొందినవారు) 1,76,726 మంది పాస్ అయ్యారు. బీ గ్రేడ్‌ (60 శాతం - 75 శాతం మధ్య) 1,04,896 మంది, సీ గ్రేడ్‌ (60 శాతం - 50 శాతం మధ్య) 61,901 మంది, డీ గ్రేడ్‌ (50 శాతం - 35 శాతం మధ్య) 1,08 347 మంది, కంపార్ట్‌మెంటల్‌ పాస్‌ 21,980 మంది చొప్పున ఉన్నారు.