శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (09:13 IST)

పోచారం శ్రీనివాస రెడ్డికి మరోమారు కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి మరోమారు కరోనా వైరస్ సోకింది. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలో ఉన్నప్పటికీ వైద్యుల సలహా మేరకు ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వుంది. ఈయనకు కొన్ని నెలల కిందటే కోరనా వైరస్ సోకింది. అపుడు కూడా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఇపుడు మరోమారు ఆయనకు పాజిటివ్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 
 
అయితే, వైద్యులు మాత్రం పోచారం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క కూడా ఈ కరోనా బాధితుల్లో చేరారు. ప్రస్తుతం ఈయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 
 
ఇదిలావుంటే, ఆదివారం తెలంగాణ ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు రాష్ట్రంలో కొత్తగా 2047మందికి ఈ వైరస్ సోకింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1174 కేసులు నమోదు కాదా. వీటిలో మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 178 మంది ఈ వైరస్ బారినపడ్డారు.