గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మే 2023 (09:04 IST)

తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువ.. 44 డిగ్రీలు..?

summer
తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా వుంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజధాని హైదరాబాద్‌లో గరిష్ఠంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వొచ్చని తెలిపింది. 
 
మరోవైపు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.