మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 మే 2023 (12:48 IST)

ప్రేమించిన అమ్మాయితో పెళ్లి.. కట్నం చాల్లేదని వరుడు పరార్

marriage
ప్రేమించిన అమ్మాయి కోసం అంతా చేశాడు. పెళ్లికి సిద్ధమయ్యాడు. కానీ పెళ్లి పీటలు ఎక్కగానే అసలు బుద్ధి చూపెట్టాడు. కట్నం చాల్లేదని పెళ్లి పీటల నుంచి పారిపోయాడు. 
 
ప్రేమించిన అమ్మాయి కోసం పెద్దలను ఎదిరించి పెళ్లికి సిద్ధమైనా.. రూ. 15 లక్షల కట్నం ఇస్తేనే ప్రేమికురాలి మెడలో తాళికడతానని చెప్పాడు. ఆరు లక్షల రూపాయలు ఇస్తామని వధువు తరపు వారు అంగీకరించినా.. అందుకు అంగీకరించకుండా వరుడు పారిపోయాడు. 
 
సంగారెడ్డి జిల్లా మానూరు మండలంలో జరిగిందీ ఘటన. మండలానికి చెందిన యువతి, కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించి.. కొండాపూర్ మండలంలోని ఓ గుడిలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. 
 
మరికాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా వరుడు రూ.15 లక్షల కట్నం డిమాండ్ చేశాడు. అప్పుడు అమ్మాయి మెడలో తాళి కడతానని చెప్పాడు. అంత ఇచ్చుకోలేమని, రూ. 6 లక్షలు ఇస్తామని యువతి కుటుంబ సభ్యులు చెప్పినా వరుడు వినిపించుకోలేదు. 
 
ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. ఈ ఘటనపై వధువు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.