గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 25 డిశెంబరు 2021 (11:05 IST)

అతివేగంగా వచ్చి రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం

ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. వేగంగా వచ్చిన రెండు మోటార్ బైకులు ఒకటికొకటి ఢీకొట్టుకోవడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

 
తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితంలేకపోయింది. అతడు కూడా మరణించాడు. ఉట్నూరు మండలం కుమ్మరి తండా వద్ద రాత్రివేళ ఈ ప్రమాదం జరిగింది.