ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (07:36 IST)

నేడు తెలంగాణ విమోచన దినోత్సవం : నిర్మల్‌లో అమిత్ షా బహిరంగ సభ

ఓవైపు ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపేందుకు ఇష్టపడట్లేదు. ప్రతిపక్షాలు మాత్రం అధికారికంగా జరపాల్సిందేనని పట్టుపడుతున్నాయి. ఈ రాజకీయాలు ఎప్పుడూ ఉండేవే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగనుంది. 
 
ఇందుకోసం తెలంగాణ బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్మల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. 
 
ఢిల్లీ నుంచి నాందేడ్, నాందేడ్ నుంచి హెలీకాఫ్టర్‌లో నిర్మల్ సభకు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా నిర్మల్ సభ వద్ద రక్తదాన శిబిరం ప్రారంభించనున్నట్లు చెప్పారు. బహిరంగ సభ అనంతరం అమిత్ షా.. నాందేడ్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని పేర్కొన్నారు.