శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2023 (15:19 IST)

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత

deadbody
మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి ఇకలేరు. అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 70 యేళ్లు. అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ఏవోబీలోని దండకారణ్యలో ప్రాణాలు విడిచారని తెలుపుతూ మావోయిస్టు సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేసింది. 
 
తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రాజిరెడ్డి తొలితరం మావోయిస్టు నేతల్లో ఒకరు. అంచెలంచలుగా ఎదిగి ప్రస్తుతం ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లతో కూడిన మావోయిస్టు నైరుతి ప్రాంతీయ బ్యూరోలో విప్లవాత్మక  ఉద్యమానికి ఆయన ఇన్‌చార్జిగా పని చేశారు. 
 
కాగా, రాజిరెడ్డిపై దేశ వ్యాప్తంగా పలు కేసులు నమోదైవున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఆయనపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది. పీపుల్స్ వార్ అగ్రనేతలతో కలిసి ఆయన పనిచేశారు. కొండపల్లి సీతారామయ్య, గణపతి, సత్యమూర్తిలకు రాజిరెడ్డి సహచరుడు. ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్య కేసులో నిందితుడిగా కూడా ఉన్నారు.