గిరిజన బంధు అమలు చేయాలి: ఈటల రాజేందర్
దళితబంధు మాదిరి గిరిజన బంధు అమలు చేయాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలను వంచించటానికి సీఎం కేసీఆర్ దొంగ స్కీంలను తీసుకొచ్చాడని మండిపడ్డారు.
నవంబర్ 4న దళితబంధు అమలు చేస్తామన్న కేసీఆర్ మాటలు ఒట్టి మాటలేని తప్పుబట్టారు. రిజర్వేషన్లను అడ్డుకుని గిరిజనుల కళ్లల్లో కేసీఆర్ మట్టికొట్టారని విమర్శించారు.
మూడెకరాల భూమి దేవుడెరుగు.. సాగుచేసుకుంటోన్న పోడు భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ వస్తే గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.
గిరిజన విద్యార్థులకు పాత బకాయిలు, మెస్ ఛార్జీలు వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో కేసీఆర్ చెప్పాలని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.